కుటుంబం అంతా కలిసి చూడొచ్చు

ABN , First Publish Date - 2023-08-24T02:38:05+05:30 IST

కార్తిక్‌ రాజు, ప్రశాంత్‌ కార్తి, ఆమని, మిస్తి చక్రవర్తి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అను’. సందీప్‌ గోపిశెట్టి దర్శక నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది...

కుటుంబం అంతా కలిసి చూడొచ్చు

కార్తిక్‌ రాజు, ప్రశాంత్‌ కార్తి, ఆమని, మిస్తి చక్రవర్తి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అను’. సందీప్‌ గోపిశెట్టి దర్శక నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేస్తారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్‌ నటి ఆమని మాట్లాడుతూ ‘‘చక్కటి సందేశాత్మక చిత్రమిది. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. చాలా రోజుల తరవాత ఓ మంచి పాత్ర చేశాను. కరోనా వల్ల కాస్త ఆలస్యమైనా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించార’’న్నారు. ‘‘సీనియర్‌ నటీనటులంతా మా సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వాళ్ల అనుభవం మాకు బాగా పనికొచ్చింది. మేం ఏదైతే అనుకొన్నామో, తెరపై అదే తీసుకొచ్చామ’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-08-24T02:38:05+05:30 IST