విలన్ వచ్చాడు
ABN , First Publish Date - 2023-04-19T03:52:33+05:30 IST
ఎన్‌టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారా? లేదా? అని కొంతకాలంగా అభిమానుల్లో జరుగుతున్న చర్చకు...

ఎన్‌టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారా? లేదా? అని కొంతకాలంగా అభిమానుల్లో జరుగుతున్న చర్చకు తెరపడింది. ఎన్‌టీఆర్‌ని ఢీ కొట్టే పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు చిత్రబృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది. పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీకపూర్. చిత్రీకరణ కోసం ఆమె సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. హీరో, హీరోయిన్లపై దర్శకుడు కొరటాల శివ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.