విద్యా వ్యవస్థను రక్షించాలనే యూనివర్సిటీ తీశా

ABN , First Publish Date - 2023-09-13T00:20:44+05:30 IST

విద్యా వ్యవస్థను రక్షించాలనే సందేశంతోనే ‘యూనివర్సిటీ’ సినిమా తీశానని, పేపర్ల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్‌ ఆగమవుతోందని నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి చెప్పారు...

విద్యా వ్యవస్థను రక్షించాలనే యూనివర్సిటీ తీశా

విద్యా వ్యవస్థను రక్షించాలనే సందేశంతోనే ‘యూనివర్సిటీ’ సినిమా తీశానని, పేపర్ల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్‌ ఆగమవుతోందని నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య , వైద్య రంగాలను జాతీయం చేయాలని డిమాండ్‌ చేశారు.. దేశ సంపదను అదానీ, అంబానీలకు ప్రధాని నరేంద్ర మోదీ ధారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు. పేపర్‌ లీకేజీ, విద ్య ప్రవేటీకరణ, ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం, యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రైవేటు యూనివర్సిటీల ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించినట్లు స్పష్టం చేశారు. అభ్యుదయ వాదులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లతో చర్చించిన తర్వాతనే యూనివర్సిటీ సినిమాను నిర్మించినట్లు తెలిపారు. సమాజంలోని ప్రతీ ఒక్కరు యూనివర్సిటీ సినిమాను ఆదరించాలని ఆర్‌. నారాయణ మూర్తి కోరారు.

ఆంధ్రజ్యోతి, వడ్డెపల్లి

Updated Date - 2023-09-13T00:20:44+05:30 IST