టీజర్‌ బాగుంది

ABN , First Publish Date - 2023-10-26T01:42:15+05:30 IST

కిశోర్‌ తేజ, భవ్యశ్రీ జంటగా నటించిన ‘బాగుంది’ చిత్రం టీజర్‌ను దర్శకుడు వేణు ఉడుగుల, ‘సెవన్‌హిల్స్‌’ సతీశ్‌ విడుదల చేశారు...

టీజర్‌ బాగుంది

కిశోర్‌ తేజ, భవ్యశ్రీ జంటగా నటించిన ‘బాగుంది’ చిత్రం టీజర్‌ను దర్శకుడు వేణు ఉడుగుల, ‘సెవన్‌హిల్స్‌’ సతీశ్‌ విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ను తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజనేని వెంకటేశ్వర్‌ రావు మాట్లాడుతూ ‘దర్శకుడు రామ్‌కుమార్‌ నా చిన్ననాటి స్నేహితుడు. సినిమా గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు. కానీ అతను చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా తీశాను. అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు. అన్ని వర్గాల వారికీ నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. ‘సస్పెన్స్‌ జానర్‌లో ఈ సినిమా తీశాం. చూసిన వాళ్లు థ్రిల్‌ ఫీలవుతారు. ఇందులో మూడు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి. హీరో కిశోర్‌ తేజ మంచి హార్డ్‌ వర్కర్‌. హీరోయిన్‌ భవ్యశ్రీ నాతో చేసిన రెండో సినిమా ఇది. అందరికీ పేరు తెచ్చే చిత్రం అవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: డాక్టర్‌ మహేంద్రబాబు, సమర్పణ: కట్ట శివ.

Updated Date - 2023-10-26T01:42:15+05:30 IST