టార్గెట్‌ రూ 3 వేల కోట్లు!

ABN , First Publish Date - 2023-11-15T00:57:44+05:30 IST

తమిళ దర్శకుడు అట్లీ మాంచి జోరు మీదున్నారు. షారుఖ్‌ ఖాన్‌తో ఆయన రూపొందించిన ‘జవాన్‌’ చిత్రం బాక్సాఫీసును కొల్లగట్టడంతో ఆయన ఉత్సాహానికి అవధులు లేవు...

టార్గెట్‌ రూ 3 వేల కోట్లు!

తమిళ దర్శకుడు అట్లీ మాంచి జోరు మీదున్నారు. షారుఖ్‌ ఖాన్‌తో ఆయన రూపొందించిన ‘జవాన్‌’ చిత్రం బాక్సాఫీసును కొల్లగట్టడంతో ఆయన ఉత్సాహానికి అవధులు లేవు. ఈసారి సినిమా ‘అంతకుమించి’ ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఉత్తరం, దక్షిణాన్ని కలుపుతూ షారుఖ్‌ ఖాన్‌, విజయ్‌ కాంబినేషన్‌లో అత్యంత భారీ చిత్రాన్ని తీయాలని సన్నాహాలు ప్రారంభించారు. ఇటీవల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు అట్లీ. ‘ఇటీవల ఓ పార్టీలో కలుసుకున్న షారుఖ్‌, విజయ్‌ నా సినిమాల గురించి మాట్లాడుకుని నాకు ఫోన్‌ చేశారు. మల్టీస్టారర్‌ తీసే ఆలోచన ఉంటే అందులో తను నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు షారుఖ్‌ చెప్పారు. విజయ్‌ కూడా ఇదే మాట చెప్పారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ తీయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ తయారు చేస్తున్నా. నా తదుపరి చిత్రం అదే అవుతుంది. ఆ సినిమాతో రూ. 3 వేల కోట్లు వసూలు చేయాలని నా ఆలోచన. సాధిస్తాననే నమ్మకం ఉంది’ అన్నారు అట్లీ. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కావచ్చని కూడా ఆయన తెలిపారు.

Updated Date - 2023-11-15T00:57:48+05:30 IST