వినోదాల విజయం

ABN , First Publish Date - 2023-05-03T01:56:52+05:30 IST

సునీల్‌, శ్రీనివాసరెడ్డి, ధనరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భువన విజయమ్‌’. యలమంద చరణ్‌ దర్శకుడు. కిరణ్‌, విఎస్కే నిర్మాతలు...

వినోదాల విజయం

సునీల్‌, శ్రీనివాసరెడ్డి, ధనరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భువన విజయమ్‌’. యలమంద చరణ్‌ దర్శకుడు. కిరణ్‌, విఎస్కే నిర్మాతలు. మే 12న విడుదల అవుతోంది. మంగళవారం ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినోదాల ప్రయాణం ఈ చిత్రం. ఓ ఇంట్లో జరిగే కథ. సరదాగా మొదలై, అనేక మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కర్మ సిద్ధాంతాన్ని అంతర్లీనంగా చెప్పాం. సునీల్‌ నటన, ఆ పాత్రలో ఉండే షేడ్స్‌ ఆకట్టుకొంటాయ’’న్నారు. సంగీతం: శేఖర్‌ చంద్ర.

Updated Date - 2023-05-03T01:56:52+05:30 IST