Premkumar : ఆ పెళ్లి కొడుకు కథే మా సినిమా
ABN , First Publish Date - 2023-08-14T00:55:49+05:30 IST
సంతోష్ శోభన్, రాశీ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది...

సంతోష్ శోభన్, రాశీ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ మహర్షి సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు.
పలు సినిమాలు, ఓటీటీలో షోలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాను. మా నిర్మాత శివప్రసాద్ పన్నీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నా కామెడీ టైమింగ్ అంటే సంతోష్‌కు బాగా ఇష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ప్రేమ్‌కుమార్’ కథను డెవలప్ చేశాను.
కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. వాళ్లిద్దరూ ఒక్కటవుతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. అతనికి కూడా ఒక జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ ‘ప్రేమ్‌కుమార్’ సినిమా తీశాను.
కుటుంబంతో కలసి చూడదగ్గ చిత్రమిది. ఆద్యంతం వినోద భరితంగా ఉంటుంది. నా భార్య, నేనూ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపిస్తాం. ఓ సీరియస్ సబ్జెక్ట్‌తో నా తర్వాతి చిత్రం ఉంటుంది.