రాయలసీమ కథ

ABN , First Publish Date - 2023-09-24T02:14:08+05:30 IST

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటించిన ‘సగిలేటి కథ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌ 6న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి చెప్పారు...

రాయలసీమ కథ

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటించిన ‘సగిలేటి కథ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌ 6న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి చెప్పారు. రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. చాలా సహజంగా ఉందనీ, ఇలాంటి కథలు ఇంతకుముందెన్నడూ చూడలేదనీ, సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందనీ సెన్సార్‌ సభ్యులు ప్రశంసించినట్లు నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుత స్పందన వచ్చిందనీ, పాటలు కూడా ఆకట్టుకున్నాయనీ వారు తెలిపారు.

Updated Date - 2023-09-24T02:14:35+05:30 IST