భార్యాభర్తల కథ

ABN , First Publish Date - 2023-05-25T01:56:44+05:30 IST

స్పందన పల్లి, యుగ్‌ రామ్‌, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ది ట్రయల్‌’. రామ్‌ గన్నీ దర్శకుడు. స్మృతి సాగి, శ్రీనివాస్‌ కే.నాయుడు నిర్మాతలు. బుధవారం

భార్యాభర్తల కథ

స్పందన పల్లి, యుగ్‌ రామ్‌, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ది ట్రయల్‌’. రామ్‌ గన్నీ దర్శకుడు. స్మృతి సాగి, శ్రీనివాస్‌ కే.నాయుడు నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో రఘు కుంచె, శ్రీకాంత్‌ విస్సా, రక్షిత్‌ చేతుల మీదుగా టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘భార్యభర్తల కథ ఇది. వారిద్దరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. వాటి పరిణామాలు ఏమిటి? ఆ తరవాత ఏమైందో తెరపై చూసి తెలుసుకోవాలి. కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. చాలామందిని ఆడిషన్స్‌ చేసి, ఆ తరవాత స్పందనని ఎంచుకొన్నామ’’న్నారు.


Updated Date - 2023-05-25T01:56:44+05:30 IST