తండ్రీ కొడుకుల కథ

ABN , First Publish Date - 2023-08-28T01:25:25+05:30 IST

శాంతిచంద్ర, సిమ్రితి (మిస్‌ ఇండియా 2022) జంటగా నటిస్తున్న చిత్రం ‘డర్టీ ఫెలో’. దీపికా సింగ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మూర్తి సాయి అడారి దర్శకత్వంలో జి. శాంతిబాబు నిర్మిస్తున్నారు...

తండ్రీ కొడుకుల కథ

శాంతిచంద్ర, సిమ్రితి (మిస్‌ ఇండియా 2022) జంటగా నటిస్తున్న చిత్రం ‘డర్టీ ఫెలో’. దీపికా సింగ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మూర్తి సాయి అడారి దర్శకత్వంలో జి. శాంతిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సందర్భంగా శాంతి చంద్ర మాట్లాడుతూ ‘వచ్చే వారం టీజర్‌ను, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం. డాక్టర్‌ సతీష్‌ ఇచ్చిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తండ్రీ కొడుకుల కథ ఇది. యాక్షన్‌ డ్రామాగా రూపొందించాం’ అన్నారు. ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్‌. రామకృష్ణ

Updated Date - 2023-08-28T01:25:25+05:30 IST