కలం యోధుడి కథ

ABN , First Publish Date - 2023-11-09T02:28:38+05:30 IST

తెలంగాణ ఉద్యమకారుడు, కవి కాళోజీ జీవితకథ ఆధారంగా ‘ప్రజాకవి కాళోజీ’ పేరుతో రూపొందిన చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది...

కలం యోధుడి కథ

తెలంగాణ ఉద్యమకారుడు, కవి కాళోజీ జీవితకథ ఆధారంగా ‘ప్రజాకవి కాళోజీ’ పేరుతో రూపొందిన చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ప్రభాకర్‌ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని ‘అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా’ అనే పాటను నిర్మాత డి.సురేశ్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాట బాగుంది. ఇలాంటి వీరుల కథను ఎన్నుకొని సినిమా తీసిన నిర్మాతకు అభినందనలు. చిత్రం మంచి విజయం సాధించాలి’ అన్నారు. దర్శకుడు ప్రభాకర్‌ జైనీ మాట్లాడుతూ ‘ఇటీవల సెన్సార్‌ పూర్తయింది. అందరూ కమర్షియల్‌ చిత్రాలు తీస్తుంటే వాటికి భిన్నంగా ఉద్యమనాయకుడు కాళోజీ బయోపిక్‌ నిర్మించారంటూ సెన్సార్‌ సభ్యులు అభినందించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - 2023-11-09T02:28:40+05:30 IST