సెకండ్‌ సీజన్‌ గ్రాండియర్‌గా ఉంటుంది

ABN , First Publish Date - 2023-08-09T03:55:48+05:30 IST

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించిన ‘దయా’ వెబ్‌సిరీస్‌ ఇటీవలె డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈషా రెబ్బా, నంబీషన్‌ రమ్య కీలకపాత్రలు పోషించారు...

సెకండ్‌ సీజన్‌ గ్రాండియర్‌గా ఉంటుంది

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించిన ‘దయా’ వెబ్‌సిరీస్‌ ఇటీవలె డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈషా రెబ్బా, నంబీషన్‌ రమ్య కీలకపాత్రలు పోషించారు. పవన్‌ సాధినేని దర్శకుడు. ‘దయా’ సిరీస్‌కు ప్రేక్షకాదరణ దక్కుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

  • స్ట్రీమింగ్‌ మొదలైనప్పటి నుంచి మా వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకులతో పాటు పరిశ్రమ నుంచి చక్కటి స్పందన వస్తోంది. బెంగాలీ వెబ్‌సిరీస్‌ తక్‌ధీర్‌ నుంచి మెయిన్‌ పాయింట్‌ తీసుకుని కథను కొత్తగా అల్లుకున్నాను. కొత్త పాత్రలు సృష్టించాను.

  • జేడీ చక్రవర్తికి కథ పంపిస్తే చదవకుండానే ఓకే చెప్పారు. ఇప్పుడు ఆయన్ను అందరూ ‘దయా’ అని పిలుస్తున్నారు. అసలైన కథ, ట్విస్ట్‌లు సెకండ్‌ సీజన్‌లో ఉంటాయి. ఈ సిరీస్‌ను చాలా పరిమిత బడ్జెట్‌తో చేశాం. సెకండ్‌ సీజన్‌ మాత్రం గ్రాండియర్‌గా ఉండబోతోంది. స్ర్కిప్ట్‌ సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌లో ఒక చిత్రం చేస్తున్నాను.

Updated Date - 2023-08-09T03:55:48+05:30 IST