బాయ్స్‌ హాస్టల్‌కు రెస్పాన్స్‌ బాగుంది

ABN , First Publish Date - 2023-08-30T04:55:09+05:30 IST

అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు కన్నడంలో హిట్‌ అయిన ‘బేకగిద్దరే’ను ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో అనువదించి విడుదల చేశాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడంతో యూనిట్‌ సక్సెస్‌ మీట్‌...

బాయ్స్‌ హాస్టల్‌కు రెస్పాన్స్‌ బాగుంది

అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు కన్నడంలో హిట్‌ అయిన ‘బేకగిద్దరే’ను ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో అనువదించి విడుదల చేశాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడంతో యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత సుప్రీయ యార్లగడ్డ మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌ ఎక్కడున్నా ఆదరించడం తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత. ‘బాయ్స్‌ హాస్టల్‌’తో మరోసారి అది రుజువైంది. థియేటర్‌లో సినిమా చూస్తూ ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. నాగార్జునగారు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏ జానర్‌ సినిమా అని అడిగారు. ఏం చెప్పాలో నాకు తోచక కాసేపు ఆలోచించాను. ఎందుకంటే ఇది చాలా కొత్త తరహా చిత్రం. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడే మాకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి’ అన్నారు. మరో నిర్మాత అనురాగ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘కొత్తదనం ఉన్న కంటెంట్‌ను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ఇండియాలోనే ఇలాంటి సినిమా రాలేదు. ‘బాయ్స్‌ హాస్టల్‌ పినిమాను ప్రేక్షకులు, ముఖ్యంగా టార్గెట్‌ ఆడియన్స్‌ ఆదరిస్తున్న తీరు నెక్ట్స్‌ లెవల్‌లో ఉంది’ అన్నారు. మంత్‌ ఎండింగ్‌ కావడంతో స్టూడెంట్స్‌కు పాకెట్‌ మనీ సమస్య ఉంటుంది కనుక వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ పెట్టాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన థియేటర్ల జాబితా విడుదల చేస్తాం’ అని మరో నిర్మాత శరత్‌ చెప్పారు. ‘ఇది తెలుగు సినిమాలా ఉండాలని చాలా హార్డ్‌ వర్క్‌ చేసి డబ్‌ చేశాం. కొత్త వారిని సపోర్ట్‌ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఒక అడుగు ముందు ఉంటారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను’ అన్నారు దర్శకుడు నితిన్‌ కృష్ణమూర్తి.

Updated Date - 2023-08-30T04:55:09+05:30 IST