Chandramukhi 2 : రిలీజ్‌ డేట్‌ మారింది

ABN , First Publish Date - 2023-09-09T04:27:32+05:30 IST

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌, బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్‌,

 Chandramukhi 2 : రిలీజ్‌ డేట్‌ మారింది

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌, బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్‌, జ్యోతిక నటించిన ‘చంద్రముఖి’ చిత్రానికి ఇది సీక్వెల్‌. పి. వాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ తొలుత ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ తేదీన ‘చంద్రముఖి 2’ విడుదల కావడం లేదు. శుక్రవారం కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్రబృంద ం ప్రకటించింది. ఈ నెల 28న ‘చంద్రముఖి 2’ను విడుదల చేస్తున్నారు. ఈ విషయన్ని తెలుపుతూ యూనిట్‌ ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్‌, వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్‌ అలరించనున్నారు.

Updated Date - 2023-09-09T04:27:38+05:30 IST