సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు!

ABN, First Publish Date - 2023-03-25T02:58:19+05:30

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రధారులుగా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. సముద్రఖని దర్శకుడు. విశ్వప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రధారులుగా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. సముద్రఖని దర్శకుడు. విశ్వప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించారు. జులై 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదాయ సీతమ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమా కోసం పలు పేర్లు పరిశీలిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈనెలాఖరుకి పవన్‌పై తెరకెక్కించాల్సిన సీన్లు పూర్తవుతాయి. ఏప్రిల్‌ నాటికి చిత్రీకరణ ఓ కొలిక్కి వస్తుంది. మే నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం అవుతాయి.

Updated Date - 2023-03-25T02:58:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!