Gandivadhari Arjuna: ఆపరేషన్‌ మొదలైంది!

ABN , First Publish Date - 2023-08-15T03:04:31+05:30 IST

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘గాంఢీవధారి అర్జున’ ఈనెలలో విడుదలకు సిద్దంగా ఉంది. ఈలోగా మరో సినిమా పనిలో పడిపోయారు వరుణ్‌. ఆయన కథానాయకుడిగా...

Gandivadhari Arjuna: ఆపరేషన్‌ మొదలైంది!

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘గాంఢీవధారి అర్జున’ ఈనెలలో విడుదలకు సిద్దంగా ఉంది. ఈలోగా మరో సినిమా పనిలో పడిపోయారు వరుణ్‌. ఆయన కథానాయకుడిగా శక్తి ప్రతాప్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సోని పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అనే పేరు ఖరారు చేశారు. సోమవారం చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ కథానాయికగా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఈ యేడాది డిసెంబరులో ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్‌ తెలిపారు.

Updated Date - 2023-08-15T03:05:53+05:30 IST