కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nithin in Tammudu : తమ్ముడు చేసే సందడి!

ABN, First Publish Date - 2023-08-28T01:37:57+05:30

నితిన్‌ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు...

నితిన్‌ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రసాద్‌ క్లాప్‌ ఇచ్చారు. అనిల్‌ రావిపూడి స్విచ్చాన్‌ చేశారు. వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వేణు శ్రీరామ్‌ మా సంస్థలో ‘ఎంసీఏ’, ‘వకీల్‌ సాబ్‌’లాంటి సూపర్‌ హిట్లు అందించాడు. నితిన్‌తో చేసిన ‘దిల్‌’ ఎప్పటికీ మర్చిపోలేం. ఈ కాంబోలో ఓ సినిమా రావడం సంతోషంగా ఉంది. సెప్టెంబరు 1 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలెడతామ’’ని నిర్మాతలు తెలిపారు. ఛాయాగ్రహణం: సేతు.

Updated Date - 2023-08-28T01:37:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!