కొత్త చిత్రం ఖరారు
ABN , First Publish Date - 2023-05-21T02:08:29+05:30 IST
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ఖరారైంది. శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు....

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ఖరారైంది. శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దీనికి భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌పై ఎం శ్రీనివాసులు, డి. వేణుగోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి నిర్మిస్తున్నారు. ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
విభిన్న గెటప్పుల్లో
మంచు మనోజ్ హీరోగా వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘మనం మనం బరంపురం’ అనేది ట్యాగ్‌లైన్. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మాతలు. మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో ఆయన విభిన్న గెటప్పుల్లో కనిపించి ఆకట్టుకున్నారు.