The nation is waiting for Dussera : దేశం... దసరా కోసం ఎదురుచూస్తోంది
ABN , First Publish Date - 2023-03-19T00:48:12+05:30 IST
‘‘దసరా’ చిత్రం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది వయలెంట్ మాస్ రస్కీ ఫిల్మ్’ అని నాని చెప్పారు. ఆయన హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కీర్తిసురేశ్ కథానాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మాత...

‘‘దసరా’ చిత్రం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది వయలెంట్ మాస్ రస్కీ ఫిల్మ్’ అని నాని చెప్పారు. ఆయన హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కీర్తిసురేశ్ కథానాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 30న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం శనివారం మీడియాతో మాట్లాడింది. నాని మాట్లాడుతూ ‘సుధాకర్ గారి సహకారం వల్లే ‘దసరా’ అద్భుతంగా వచ్చింది. మా కన్నా మా టీం ఎక్కువ కష్టపడింది. దీక్షిత్ మంచి పాత్ర చేశాడు. కీర్తి అద్భుతంగా నటించారు. శ్రీకాంత్ గొప్ప దర్శకుడు’ అన్నారు. కీర్తిసురేశ్ మాట్లాడుతూ ‘‘నేను లోకల్’ తర్వాత నానితో చేయడం ఆనందంగా ఉంది. ‘దసరా’ క్లైమాక్స్ బావుంటుంది. నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా కుమ్మేసేలా ఉంటుంది’ అని చెప్పారు. నానితో సినిమా చేయాలని మూడేళ్లుగా ఇలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నానని సుధాకర్ చెరుకూరి అన్నారు. సస్పెన్స్ కోసమే ఈ చిత్రంలో విలన్ పాత్రను ప్రచార కార్యక్రమాల్లో చూపలేదని శ్రీకాంత్ ఓదెల తెలిపారు.