మాసోడి మిస్టరీ ఇక షురూ!

ABN , First Publish Date - 2023-06-13T04:08:14+05:30 IST

రవితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. నవదీప్‌ కీలక పాత్రధారి. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత....

మాసోడి మిస్టరీ ఇక షురూ!

రవితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. నవదీప్‌ కీలక పాత్రధారి. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రానికి ‘ఈగల్‌’ అనే పేరు ఖరారు చేశారు. ‘మాసోడి మిస్టరీ ఇక షురూ’ అంటూ సోమవారం ఫస్ట్‌ గ్లిమ్స్‌ విడుదల చేశారు. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా కథానాయకుడ్ని అన్వేషిస్తూ పోలీసులు, ఇతర బృందాలూ సాగించే అన్వేషణ ఈ ప్రచార చిత్రంలో కనిపించింది. చివరికి... రవితేజ క్యారెక్టర్‌ని రివీల్‌ చేశారు. 2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథతో, అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తీర్చిదిద్దుతున్న చిత్రమిది. రవితేజ చిత్రాల్లో ప్రత్యేకంగా మిగిలిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంద’’ని నిర్మాత తెలిపారు. శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, కావ్య ధాపర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవ్‌జంద్‌.

Updated Date - 2023-06-13T04:08:19+05:30 IST