రాచరికం మొదలైంది

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:40 AM

విజయ్‌శంకర్‌ హీరోగా, అప్సరారాణి హీరోయిన్‌గా నటిస్తున్న ‘రాచరికం’ చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. లంకలపల్లి సురేశ్‌ దర్శకత్వంలో ఈశ్వర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు...

రాచరికం మొదలైంది

విజయ్‌శంకర్‌ హీరోగా, అప్సరారాణి హీరోయిన్‌గా నటిస్తున్న ‘రాచరికం’ చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. లంకలపల్లి సురేశ్‌ దర్శకత్వంలో ఈశ్వర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత డి.ఎ్‌స.రావు కెమెరా స్విచాన్‌ చేయగా, మరో నిర్మాత రాజ్‌ కందుకూరి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంది. మూవీ గ్లింప్స్‌ విడుదల చేశాం. ఇకపై కంటిన్యూగా అప్‌డేట్స్‌ ఇస్తాం’ అని చెప్పారు. హీరో విజయ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘టైటిల్‌ రివిల్‌ చేసినప్పటి నుంచి రెస్పాన్స్‌ బాగుంది. దర్శకుడు బోయపాటి శ్రీను పర్సనల్‌గా మెసేజ్‌ పెట్టారు. ఏడు నెలలుగా దర్శకనిర్మాతలు ఈ మూవీ మీదే ఫోకస్‌ పెట్టారు. నాకు మంచి పాత్ర ఇచ్చారు. అలాగే అప్సరా రాణి ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. మేం రెట్రో లుక్‌లో కనిపిస్తాం’ అని తెలిపారు. పనిచేసే ప్రతి ఒక్కరికీ పేరు తెచ్చే మంచి సినిమా అవుతుందన్నారు నిర్మాత ఈశ్వర్‌. విజయ రామరాజు, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, మహబూబ్‌ బాషా, రూపేష్‌ మర్రావు, ప్రాచీ థాకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంగి, ఛాయాగ్రహణం: ఆర్య సాయికృష్ణ, ఎడిటింగ్‌: జెపీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చాణక్య.

Updated Date - Dec 19 , 2023 | 12:40 AM