ముహూర్తం ఖరారు

ABN , First Publish Date - 2023-03-19T00:46:04+05:30 IST

‘ఎన్టీఆర్‌ 30’ ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 23న లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం ప్రకటించింది...

ముహూర్తం ఖరారు

‘ఎన్టీఆర్‌ 30’ ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 23న లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓపెనింగ్‌కు ఎవరూ ఊహించని సెలబ్రిటి అతిథిగా రాబోతున్నట్లు టాలీవుడ్‌ సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ నిర్మిస్తున్నాయి. అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-03-19T00:46:04+05:30 IST