కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముహూర్తం కుదిరింది

ABN, First Publish Date - 2023-10-27T01:29:40+05:30

టాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వివాహానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 1న ఈ ప్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు...

టాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వివాహానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 1న ఈ ప్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. ఇటలీలోని టుస్కానీ ఈ వేడుకకు వేదిక కానుంది. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్‌ పీఆర్‌ బృందం సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిమంది మాత్రమే పెళ్లికి హాజరవుతున్నారు. సినీ ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ‘మిస్టర్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో వరుణ్‌, లావణ్య తొలిసారి ఇటలీలోనే కలుసుకున్నారు. దాన్ని సెంటిమెంట్‌గా భావించి ఇప్పుడు పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకుంటున్నారు.

Updated Date - 2023-10-27T01:29:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!