The moment has arrived : ముహూర్తం కుదిరింది

ABN , First Publish Date - 2023-07-23T03:03:55+05:30 IST

‘పలాస’ చిత్రంతో ఆకట్టుకొన్న దర్శకుడు కరుణ కుమార్‌. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. వరుణ్‌ నటించే 14వ చిత్రమిది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది..

The moment has arrived : ముహూర్తం కుదిరింది

‘పలాస’ చిత్రంతో ఆకట్టుకొన్న దర్శకుడు కరుణ కుమార్‌. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. వరుణ్‌ నటించే 14వ చిత్రమిది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మాతలు. ఈనెల 27న ప్రారంభం కానుంది. 1960 నేపథ్యంలో సాగే చిత్రమిది. వరుణ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఆ వాతావరణం, అప్పటి అనుభూతి కోసం చిత్ర యూనిట్‌ చాలా జాగ్రత్తలు తీసుకొంటోంది. వరుణ్‌తేజ్‌ని ఇప్పటి వరకూ ఎవరూ చూడని క్యారెక్టర్‌లో ఆవిష్కరించబోతున్నామని, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులూ ఈ చిత్రంలో పనిచేస్తున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు. కథానాయిక, ఇతర వివరాల్ని చిత్రబృందం త్వరలో అఽధికారికంగా వెల్లడించనుంది.

Updated Date - 2023-07-23T03:12:29+05:30 IST