కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ప్రతినిధి’ ప్రయాణం మొదలైంది

ABN, First Publish Date - 2023-08-29T03:10:07+05:30

నారా రోహిత్‌ కెరీర్‌లో ‘ప్రతినిధి’ ఓ చక్కటి ప్రయత్నంగా మిగిలింది. ఇప్పుడు ‘ప్రతినిధి 2’ కూడా వస్తోంది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు...

నారా రోహిత్‌ కెరీర్‌లో ‘ప్రతినిధి’ ఓ చక్కటి ప్రయత్నంగా మిగిలింది. ఇప్పుడు ‘ప్రతినిధి 2’ కూడా వస్తోంది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండికళ్ల రాజేందర్‌ రెడ్డి నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. నారా రోహిత్‌పై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘ప్రతినిధిలో ఓ సామాజిక సమస్యని హీరో ప్రజల ముందుకు తీసుకొచ్చిన విధానం అందరికీ బాగా నచ్చింది. ఈసారి పెద్ద స్పాన్‌ ఉన్న కథని ఎంచుకొన్నాం. ప్రేక్షకులకు వినోదంతో పాటు చక్కటి సందేశాన్ని ఇచ్చే చిత్రమిది. కథనాయిక, ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామ’’న్నారు నిర్మాతలు. సంగీతం: మహతి స్వర సాగర్‌.

Updated Date - 2023-08-29T03:10:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!