‘ప్రతినిధి’ ప్రయాణం మొదలైంది
ABN , First Publish Date - 2023-08-29T03:10:07+05:30 IST
నారా రోహిత్ కెరీర్‌లో ‘ప్రతినిధి’ ఓ చక్కటి ప్రయత్నంగా మిగిలింది. ఇప్పుడు ‘ప్రతినిధి 2’ కూడా వస్తోంది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు...
నారా రోహిత్ కెరీర్‌లో ‘ప్రతినిధి’ ఓ చక్కటి ప్రయత్నంగా మిగిలింది. ఇప్పుడు ‘ప్రతినిధి 2’ కూడా వస్తోంది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండికళ్ల రాజేందర్ రెడ్డి నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. నారా రోహిత్‌పై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘ప్రతినిధిలో ఓ సామాజిక సమస్యని హీరో ప్రజల ముందుకు తీసుకొచ్చిన విధానం అందరికీ బాగా నచ్చింది. ఈసారి పెద్ద స్పాన్ ఉన్న కథని ఎంచుకొన్నాం. ప్రేక్షకులకు వినోదంతో పాటు చక్కటి సందేశాన్ని ఇచ్చే చిత్రమిది. కథనాయిక, ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామ’’న్నారు నిర్మాతలు. సంగీతం: మహతి స్వర సాగర్.