యువత మెచ్చే ఐక్యూ
ABN , First Publish Date - 2023-05-22T03:38:55+05:30 IST
సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ నటీనటులుగా రూపొందిన చిత్రం ‘ఐక్యూ’ (పవర్ ఆఫ్ స్టూడెంట్). సుమన్, బెనర్జీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు..

సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ నటీనటులుగా రూపొందిన చిత్రం ‘ఐక్యూ’ (పవర్ ఆఫ్ స్టూడెంట్). సుమన్, బెనర్జీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. జూన్ 2న విడుదలవుతోంది. యువతను ఆకట్టుకొనే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిదని నిర్మాత తెలిపారు. చిన్న సినిమా అయినా మంచి కాన్సె్‌ప్టతో రూపొందిన చిత్రమిదని దర్శకుడు వివరించారు.