రామ్‌చరణ్ నిర్మాతగా ది ఇండియా హౌస్
ABN, First Publish Date - 2023-05-29T00:14:24+05:30
రామ్‌చరణ్ తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలసి వీ మెగా పిక్చర్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్..
రామ్‌చరణ్ తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలసి వీ మెగా పిక్చర్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్ జన్మదినం సందర్భంగా ఈ బేనర్‌లో నిర్మించబోయే తొలి చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘ది ఇండియా హౌస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నారు. అనుపమ్‌ఖేర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ను బట్టి, స్వాతంత్ర్యానికి పూర్వం లండన్‌లోని ఇండియా హౌస్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది అని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.