The Gentlemen 2 launch : జెంటిల్‌మెన్ 2 ప్రారంభం
ABN , First Publish Date - 2023-08-20T02:12:45+05:30 IST
తాను హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ తన ఆత్మ తమిళం, శరీరం తెలుగు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. నిర్మాత కేటీ కుంజుమోన్ తెరకెక్కిస్తున్న ‘జెంటిల్‌మేన్ 2’ ప్రారంభోత్సవం...

తాను హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ తన ఆత్మ తమిళం, శరీరం తెలుగు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. నిర్మాత కేటీ కుంజుమోన్ తెరకెక్కిస్తున్న ‘జెంటిల్‌మేన్ 2’ ప్రారంభోత్సవం శనివారం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా కీరవాణికి కుంజుమోన్ ఘన సన్మానం చేశారు. కీరవాణి మాట్లాడుతూ ‘‘మా కుటుంబం చెన్నైలో ఉన్న సమయంలోనే అమ్మ కడుపులో పడ్డాను. ఆ తర్వాత విశాఖకు వెళ్ళాం. చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వెళ్ళడంతో అక్కడ స్థిరపడిపోయాం. కుంజుమోన్ తమిళంలో మళ్ళీ అవకాశం కల్పించారు. ‘జెంటిల్‌మేన్ 2’ విజయానికి నా వంతు కృషి చేస్తా’ అన్నారు. కుంజుమోన్ మాట్లాడుతూ ‘అందరూ మెచ్చేలా కొత్త చిత్రం ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, గేయరచయిత వైరముత్తు, జపాన్ కాన్సులేట్ జనరల్ టగ మసయుకి, బంగ్లాదేశ్ హైకమిషన్ డిప్యూటీ హెడ్ ఎండీ అరిఫుర్ రెహ్మాన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ రవి కొట్టరకర, సినీ నటుడు సుమన్, నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, కే.రాజన్, రాజకీయ నేత నాంజిల్ సంపత్, దర్శకులు కదిర్, గోకుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘జెంటిల్‌మేన్-2’ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకురానుంది.
(ఆంధ్రజ్యోతి, చెన్నై)