తొలి మజిలీ పూర్తి

ABN , First Publish Date - 2023-08-31T02:34:45+05:30 IST

సందీప్‌ మాధవ్‌, కేథరిన్‌ థ్రెసా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. అశోక్‌ తేజ(ఓదెల రైల్వే స్టేషన్‌ ఫేమ్‌) దర్శకత్వంలో...

తొలి మజిలీ పూర్తి

సందీప్‌ మాధవ్‌, కేథరిన్‌ థ్రెసా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. అశోక్‌ తేజ(ఓదెల రైల్వే స్టేషన్‌ ఫేమ్‌) దర్శకత్వంలో దావులూరి జగదీశ్‌, పల్లి కేశవరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్ర విశేషాలను నిర్మాతలలో ఒకరైన జగదీశ్‌ తెలుపుతూ ‘మా సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సందీప్‌ మాధవ్‌ నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కేథరిన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. రెండో షెడ్యూల్‌ సెప్టెంబర్‌ నాలుగు నుంచి జరుగుతుంది. ప్రముఖ దర్శకుడు సంపత్‌నందిగారు మా కథ విని ఇంప్రెస్‌ అయి, ఓ క్రేజీ టైటిల్‌ సూచించారు. దాన్ని సెప్టెంబర్‌ 6న ప్రకటిస్తాం. మా దర్శకుడు అశోక్‌ అద్బుతంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సూపర్బ్‌ సాంగ్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. ‘ఆది’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి చావ్లా చాలా కాలం తర్వాత మళ్లీ ఓ ముఖ్యమైన పాత్రను మా చిత్రంలో పోషిస్తున్నారు. మరో కీలక పాత్రను రాజ చెంబోలు చేస్తున్నారు’ అన్నారు.

Updated Date - 2023-08-31T02:34:45+05:30 IST