ముగింపు ముంగిట మాస్‌ మహారాజా

ABN , First Publish Date - 2023-09-08T02:10:23+05:30 IST

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘మాస్‌ మహారాజా’. రాజ్‌తరుణ్‌, సందీప్‌ మాధవ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ‘గదర్‌ 2’ ఫేం సిమ్రత్‌ కౌర్‌, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ సట్న టీటస్‌ కథానాయికలు...

ముగింపు ముంగిట మాస్‌ మహారాజా

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘మాస్‌ మహారాజా’. రాజ్‌తరుణ్‌, సందీప్‌ మాధవ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ‘గదర్‌ 2’ ఫేం సిమ్రత్‌ కౌర్‌, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ సట్న టీటస్‌ కథానాయికలు. సి. హెచ్‌ సుధీర్‌రాజు దర్శకత్వంలో స్వాతిరాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. సందీప్‌మాధవ్‌, రాజ్‌తరుణ్‌ సరికొత్త లుక్‌లో అలరించనున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈచిత్రంలో రాజా రవీంద్ర, షఫీ, సత్యం రాజేశ్‌, ధన్‌రాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-08T02:10:23+05:30 IST