భ్రమయుగం ముగించారు

ABN , First Publish Date - 2023-10-20T02:36:47+05:30 IST

మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది...

భ్రమయుగం ముగించారు

మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. గురువారం నైట్‌షిఫ్ట్‌ సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ‘భ్రమయుగం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్‌. శశికాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమల్దా లిజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జేవియర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: షెహనాద్‌ జలాల్‌

Updated Date - 2023-10-20T02:36:47+05:30 IST