‘రావణాసుర’ కాన్సెప్ట్‌ అదే!

ABN , First Publish Date - 2023-03-25T02:44:06+05:30 IST

‘‘హీరోలూ, విలన్లూ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ప్రతీ హీరోలోనూ ఓ విలన్‌ ఉంటాడు. ప్రతీ విలన్‌లోనూ హీరో ఉంటాడు. అదే ‘రావణాసుర’ కాన్సెప్ట్‌’’ అన్నారు శ్రీకాంత్‌ విస్సా. ఆయన కథ, మాటలు అందించిన చిత్రం ‘రావణాసుర’...

‘రావణాసుర’ కాన్సెప్ట్‌ అదే!

‘‘హీరోలూ, విలన్లూ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ప్రతీ హీరోలోనూ ఓ విలన్‌ ఉంటాడు. ప్రతీ విలన్‌లోనూ హీరో ఉంటాడు. అదే ‘రావణాసుర’ కాన్సెప్ట్‌’’ అన్నారు శ్రీకాంత్‌ విస్సా. ఆయన కథ, మాటలు అందించిన చిత్రం ‘రావణాసుర’. రవితేజ కథానాయకుడు. ఏప్రిల్‌ 7న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో శ్రీకాంత్‌ విస్సా విలేకరులతో మాట్లాడుతూ ‘‘ఇదో థ్రిల్లర్‌. రవితేజ గారు ఈ తరహా చిత్రాల్లో నటించడం ఇదే తొలిసారి. ఆయన సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి. కేవలం రవితేజగారిని దృష్టిలో ఉంచుకొనే ఈ కథ తయారు చేశాం. ‘రామాయణం’కీ ఈ కథకీ సంబంధం ఉండదు. కానీ కథలో ఓ రాముడు, ఓ రావణుడు, ఓ సీత ఉంటారు. రావణుడి లక్షణాలన్నీ రవితేజ పాత్రలోనూ కనిపిస్తాయి. ఈ సినిమా రీమేక్‌ అనే ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. పూర్తిగా నా సొంత కథ. రవితేజ గారు ఇచ్చిన ఇన్‌పుట్స్‌ చాలా వరకూ ఉపయోగపడ్డాయి. సుశాంత్‌ పాత్ర కూడా వినూత్నంగా ఉంటుంది. సుధీర్‌ వర్మ గారితో ఇది రెండో చిత్రం. ఆయన ఆలోచనలు బాగుంటాయి. ఈ కథకు ఆయనే న్యాయం చేయగలరని రవితేజ గారికి అనిపించింది. అందుకే సుధీర్‌ వర్మ చేతిలో ఈ ప్రాజెక్ట్‌ పెట్టార’’న్నారు. తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ మంచి సినిమాలు చేశాను. ‘పుష్ప’తో చక్కని గుర్తింపు వచ్చింది. కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ త్వరలో విడుదల కాబోతోంది. ఇవి కాకుండా నాలుగు సినిమాలున్నాయి. దర్శకత్వం వహించే ఆలోచన ఉంది. కానీ దానికి ఇంకా సమయం ఉంద’’న్నారు.

Updated Date - 2023-03-25T02:44:08+05:30 IST