కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గాళ్‌ ఫ్రెండ్‌ ప్రయాణం ప్రారంభం

ABN, First Publish Date - 2023-11-29T01:17:50+05:30

రష్మిక మందన్న చేస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’. ‘చిలసౌ’తో ఆకట్టుకొన్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

రష్మిక మందన్న చేస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’. ‘చిలసౌ’తో ఆకట్టుకొన్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్‌ మొగలినేని నిర్మాతలు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. మారుతి స్విచ్చాన్‌ చేశారు. సాయి రాజేశ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కొత్త తరహా ఆలోచనలతో రూపొందుతున్న కథ ఇది. రష్మిక క్యారెక్టర్‌ విభిన్నంగా ఉంటుంది. ఆమె పాత్రే కథకు కీలకం. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలెడతామ’’న్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరామెన్‌: కృష్ణన్‌ వసంత్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌.

Updated Date - 2023-11-29T01:17:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!