గాళ్ ఫ్రెండ్ ప్రయాణం ప్రారంభం
ABN , First Publish Date - 2023-11-29T01:17:50+05:30 IST
రష్మిక మందన్న చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. ‘చిలసౌ’తో ఆకట్టుకొన్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు...
రష్మిక మందన్న చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. ‘చిలసౌ’తో ఆకట్టుకొన్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగలినేని నిర్మాతలు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. మారుతి స్విచ్చాన్ చేశారు. సాయి రాజేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కొత్త తరహా ఆలోచనలతో రూపొందుతున్న కథ ఇది. రష్మిక క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది. ఆమె పాత్రే కథకు కీలకం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడతామ’’న్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరామెన్: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్.