టేబుల్‌ ప్రాఫిట్‌ రావడం నమ్మకాన్ని పెంచింది

ABN , First Publish Date - 2023-11-15T00:52:11+05:30 IST

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతిరెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు...

టేబుల్‌ ప్రాఫిట్‌ రావడం నమ్మకాన్ని పెంచింది

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతిరెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సహ నిర్మాత సురేశ్‌ వర్మతో కలసి స్వాతి మీడియాతో మాట్లాడారు.

  • మాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉంది. ఇద్దరం కలసి ఓ సినిమా నిర్మించాలనుకున్నాం. ‘ఆర్‌ఎక్స్‌ 100’ టైంలోనే అజయ్‌ భూపతి మాకు ఈ కథ చెప్పారు. మమ్మల్ని బాగా ఎగ్జైట్‌ చేసింది. సినిమాలో ఓ సందేశాన్ని చెప్పిన విధానం బాగా నచ్చింది. డార్క్‌ థ్రిల్లర్‌ అయినప్పటికీ సినిమాలో అన్ని ఎమోషన్స్‌ కుదిరాయి. పాయల్‌ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మేం అనుకున్నదానికన్నా ‘మంగళవారం’ సినిమా బాగా వచ్చింది.

  • ఈ సినిమా మేం ఓకే చేయడానికి అల్లు అర్జున్‌ కూడా కారణం. ‘మీ ఇద్దరూ కలసి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టండి’ అని ఆయన చెప్పారు. ఆయన మాటతో ఽమాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు ‘మంగళవారం’ చిత్రానికి వస్తున్న స్పందన మేం కలలో కూడా ఊహించలేదు. విడుదలకు ముందే టేబుల్‌ ప్రాఫిట్‌ రావడం మాపై మాకు నమ్మకాన్ని పెంచింది.

Updated Date - 2023-11-15T00:52:13+05:30 IST