ఏజెంట్ వస్తున్నాడు
ABN , First Publish Date - 2023-03-29T02:24:55+05:30 IST
నవ్యసాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై బి. నరసింహారెడ్డి నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ఏజెంట్ నరసింహ 117’. కీర్తికృష్ణ, నిఖిత, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించారు...

నవ్యసాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై బి. నరసింహారెడ్డి నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ఏజెంట్ నరసింహ 117’. కీర్తికృష్ణ, నిఖిత, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ట్రైలర్‌ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి సోమవారం విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ‘చాలా కష్టపడి తీసిన చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీగా నిర్మించాను. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. ‘ఎన్టీఆర్ ‘దానవీరశూరకర్ణ’తో ఏజెంట్‌గా మొదలై నేడు సినిమా నిర్మించే స్థాయికి నరసింహారెడ్డి ఎదగడం అభినందనీయమని టి. ప్రసన్నకుమార్ అన్నారు.