నట విశ్వరూపం చూస్తారు

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:14 AM

తన అసాధారణ నటనతో భాష, ప్రాంతాలకు అతీతంగా కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు విక్రమ్‌. ఆయన క థానాయకుడిగా నటించిన ‘తంగలాన్‌’ చిత్రం జనవరిలో...

నట విశ్వరూపం చూస్తారు

తన అసాధారణ నటనతో భాష, ప్రాంతాలకు అతీతంగా కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు విక్రమ్‌. ఆయన క థానాయకుడిగా నటించిన ‘తంగలాన్‌’ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో గిరిజన తెగ నాయకుడిగా తన విలక్షణ నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పుడు ఆయన నటించబోయే తదుపరి చిత్రం ఖరారైంది. ‘సేతుపతి’ లాంటి పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్‌కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తిరుత్తణి నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. హీరోగా విక్రమ్‌కు ఇది 62వ చిత్రం. ఇందులో విక్రమ్‌ నట విశ్వరూపాన్ని చూస్తారని దర్శకుడు చె ప్పారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

Updated Date - Dec 22 , 2023 | 05:14 AM