అందుకే తొలి ప్రేమను వదులుకున్నా

ABN , First Publish Date - 2023-09-06T03:29:40+05:30 IST

తొలి చిత్రం ‘ధడక్‌’తోనే హీరోయిన్‌గా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు జాన్వీకపూర్‌. శ్రీదేవి తనయగా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా, కొన్ని సినిమాలతోనే ప్రతిభావంతురాలైన నటిగా నిరూపించుకున్నారు...

అందుకే తొలి ప్రేమను వదులుకున్నా

తొలి చిత్రం ‘ధడక్‌’తోనే హీరోయిన్‌గా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు జాన్వీకపూర్‌. శ్రీదేవి తనయగా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా, కొన్ని సినిమాలతోనే ప్రతిభావంతురాలైన నటిగా నిరూపించుకున్నారు. హిందీలో అగ్రహీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు జాన్వీ. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’లోనూ ఆమే కథానాయిక. సినిమాల్లోకి రాకముందే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహరియాతో జాన్వీ డేటింగ్‌లో ఉంది. ఆ రోజుల్లో ఇద్దరూ తరచూ బయట కలసి కనిపించారు. తన లవ్‌ రిలేషన్‌ షిప్‌ గురించి జాన్వీ ఇటీవలే ఓ ఇంటర్వూలో స్పందించారు. తన తొలి ప్రేమ కొద్దిరోజుల్లోనే ముగిసిపోయిందని చెప్పారు. ఆ వయసులో మానసికంగా పరిణతి లేకపోవడమే దానికి కారణమన్నారు. ‘తరచూ అబద్దాలు చెప్పాల్సి రావడంతో ఇబ్బందిపడ్డాను, ఆ సమయంలో అమ్మానాన్న చదువుమీద ఫోకస్‌ పెట్టాలని చెప్పారు. వారి మాట వింటే జీవితం బాగుంటుందని అర్థమై నా రిలేషన్‌షిప్‌కు అక్కడితో ముగింపు పలికాను’ అని చెప్పారు.

Updated Date - 2023-09-06T03:29:40+05:30 IST