భైరవుని రాక అప్పుడే

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:15 AM

సందీప్‌ కిషన్‌ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు..

భైరవుని రాక అప్పుడే

సందీప్‌ కిషన్‌ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చివరిదశ చిత్రీకరణ జరుగుతోంది. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. తాజాగా చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో సందీప్‌ కిషన్‌ మంత్రదండం పట్టుకొని కనిపించడంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. అతీత శక్తుల నేపథ్యంలో సాగే చిత్రమిదని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. హాస్య మూవీస్‌ బేనర్‌పై రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. నిర్మాత అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్త సహ నిర్మాత. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట.

Updated Date - Dec 22 , 2023 | 05:15 AM