విరాట్ కోసం పుట్టిన క్యాప్షన్ అది!
ABN, First Publish Date - 2023-09-25T01:17:09+05:30
విరాట్ కర్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు 1’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈనెల 29న విడుదల కానుంది...
విరాట్ కర్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు 1’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈనెల 29న విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి ‘సామాన్యుడి సంతకం’ అనే క్యాప్షన్ ఊరికే పెట్టలేదు. అది విరాజ్ కోసమే పుట్టింది. ఈ సినిమాతో తనని తాను నిరూపించుకొంటాడు. ఏ రంగంలో అయినా ప్రోత్సాహం దొరికితేనే ఉత్సాహంగా పనిచేస్తాం. ఈ సినిమాతో నిర్మాత నాకు అండదండగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సపోర్ట్‌తోనే మంచి సినిమా తీయగలిగా’’ అన్నారు. ‘‘హీరోగా నేను తాను రాసుకొన్న పాత్రకు సరిపోతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికీ, నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసిన మా బావకీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. నన్నెప్పుడు సెట్‌లో ఓ కొత్త అబ్బాయిలా చూడలేదు. ఈ సినిమాలో చాలా గొప్ప పాత్రలు ఉన్నాయి. వాళ్లందరి మధ్య నేను కూడా ఓ మంచి పాత్ర చేశా’’ అన్నారు విరాట్. ‘‘ఇది విరాట్ కోసమే పుట్టిన కథ. దాదాపు 294మంది కొత్తవారిని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. కథ అనుకొన్నప్పుడే ఈ సినిమాకి ఎలాంటి పరిఽధులూ పెట్టుకోవద్దనే నిర్ణయానికి వచ్చాం. ఇది నా 4వ సినిమా. ఇప్పటి వరకూ నేను తీసిన మూడు సినిమాలూ వేరు.. ఈ సినిమా వేర’’న్నారు నిర్మాత.