అదిగదిగో... ఆస్కార్‌!

ABN , First Publish Date - 2023-01-25T01:46:23+05:30 IST

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఆర్‌డీఎక్స్‌లా పేలిన డైలాగ్‌ ఇది. ఈమాట పాత్రలకే పరిమితం చేయలేదు. థియేటర్‌ వరకూ ఆపలేదు...

అదిగదిగో... ఆస్కార్‌!

‘‘ఈ నక్కల వేట ఎంత సేపు..?

కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద..’’

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఆర్‌డీఎక్స్‌లా పేలిన డైలాగ్‌ ఇది. ఈమాట పాత్రలకే పరిమితం చేయలేదు. థియేటర్‌ వరకూ ఆపలేదు. నిజంగానే రాజమౌళి అండ్‌ టీమ్‌ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేసింది. దేశం మొత్తం ఆశ్చర్యపోయే వసూళ్లు దక్కించుకొంది. ప్రపంచం మొత్తాన్ని తమ వైపుకు తిప్పుకొనేలా చేసింది. ఏ అంతర్జాతీయ చిత్రోత్సవంలో చూసినా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ పేరు మెరుస్తూనే ఉంది. రోజూ.. ఏదో ఓ పురస్కారం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చేతుల్లోకి చేరిపోతోంది. మొన్నటికి మొన్న ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డుని సొంతం చేసుకొన్న ‘నాటు...నాటు’ పాట, ఇప్పుడు ఆస్కార్‌కు అడుగు దూరంలో నిలిచింది. 95వ ఆస్కార్‌ వేడుకల్లో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నామినేషన్‌ పొందింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రమిది. ఇక ఆ ఆస్కారూ వచ్చేస్తే... భారతీయ చలన చిత్ర చరిత్రలో ‘నాటు..నాటు’ పాట సువర్ణాక్షరాలతో నాటుకు పోతుంది. సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.

Updated Date - 2023-01-25T01:46:23+05:30 IST