కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అదే నా తొలి విజయం

ABN, First Publish Date - 2023-10-25T01:20:35+05:30

పారిశ్రామిక వేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించి, నిర్మించిన ‘ఒక్కడే నంబర్‌ వన్‌’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. సునీత, శృతిక, మధువని హీరోయిన్లు. శ్రీపాద రామచంద్రరావు దర్శకుడు...

పారిశ్రామిక వేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించి, నిర్మించిన ‘ఒక్కడే నంబర్‌ వన్‌’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. సునీత, శృతిక, మధువని హీరోయిన్లు. శ్రీపాద రామచంద్రరావు దర్శకుడు. ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నిర్మాతలు సి.కల్యాణ్‌, దామోదర ప్రసాద్‌, అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రేలంగి నరసింహారావు, కాశీ విశ్వనాథ్‌ తదితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో కమ్‌ నిర్మాత వెంకన్న మాట్లాడుతూ ‘వ్యాపారవేత్తగా విజయం సాధించిన నేను సినిమారంగాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుని వచ్చాను. మంచి కథ, కథనాలతో ‘ఒక్కడే నంబర్‌ వన్‌’ చిత్రాన్ని నిర్మించాను. సీనియర్‌ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. సినిమా చూసి సురేశ్‌బాబు, ఏషియన్‌ ఫిల్మ్‌ వారు మా సినిమానలు విడుదల చేయడానికి అంగీకరించడం నా తొలి విజయం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు.

Updated Date - 2023-10-25T01:20:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!