అందుకే నరకాసుర టైటిల్‌ పెట్టాం

ABN , First Publish Date - 2023-11-02T02:45:20+05:30 IST

‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో అజ్జా శ్రీనివాస్‌ నిర్మించారు. ఈనెల 3న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది...

అందుకే నరకాసుర టైటిల్‌ పెట్టాం

‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో అజ్జా శ్రీనివాస్‌ నిర్మించారు. ఈనెల 3న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

  • ‘నరకాసుర’ కథ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దులోని ఓ కాఫీ ఎస్టేట్‌ నేపథ్యంలో సాగుతుంది. ఈసినిమాలో నేను లారీడ్రైవర్‌ శివ అనే పాత్రలో నటించాను. కాఫీ ఎస్టేట్‌ సూపర్‌వైజర్‌గా నాజర్‌గారు కనిపిస్తారు. ‘పలాస’చిత్రంలో దళితుల సమస్యను చూపించినట్లే ఈ కథలో ఒక అంశంగా హిజ్రాలకు సంబంధించిన సమస్యను తీసుకున్నాం. అన్ని వాణిజ్య హంగులు ఉన్న చిత్రమిది. చరణ్‌రాజ్‌, శ్రీమాన్‌ లాంటి అనుభవ మున్న నటులతో కలసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

  • ‘నరకాసుర’ టైటిల్‌ కథకు సరిపోతుందని పెట్టాం. రాక్షసులను అంతం చేయాలంటే వారికంటే మరింత క్రూరంగా ఉండాలనే కోణంలో ఈ టైటిల్‌ నిర్ణయించాం. అంతేకానీ నరకాసురుడికి సంబంఽధించిన అంశాలేవీ సినిమాలో ఉండవు. ‘నరకాసుర’ చిత్రాన్ని మా నిర్మాత పాన్‌ ఇండియా స్థాయిలో చేయాలని నిర్ణయించుకొని, భారీ స్థాయిలో నిర్మించారు. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, ఒడిస్సా రాష్ట్రాల్లో షూటి ంగ్‌ చేశాం. సుదీర్ఘంగా సాగే యాక్షన్‌ సీకె ్వన్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. ఔట్‌పుట్‌ చూసుకున్నాక విజయంపై ధీమాతో ఉన్నాం.

Updated Date - 2023-11-02T02:45:20+05:30 IST