ఆ వ్యాఖ్య ఉద్దేశపూర్వకం కాదు..

ABN , First Publish Date - 2023-01-27T05:01:22+05:30 IST

అక్కినేని నాగేశ్వరరావు మహానటుడని హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు...

ఆ వ్యాఖ్య ఉద్దేశపూర్వకం కాదు..

అక్కినేని నాగేశ్వరరావు మహానటుడని హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘ అక్కినేని తొక్కినేని’ అంటూ చేసిన వ్యాఖ్య గురించి ఈ సందర్భంగా విలేకరులు అడగ్గా.. ఉద్దేశపూర్వకంగా తను అనలేదన్నారు. యాదృశ్చికంగా మాట్లాడానన్నారు. ‘అక్కినేని నాగేశ్వరరావుగారు మహా నటులు. ఆయన్ని నేను బాబాయ్‌ అని పిలుస్తా. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ .. ఇండస్ర్టీకి రెండు కళ్లు. . ఎన్టీఆర్‌ నుంచి క్రమశిక్షణ, బాబాయ్‌ అక్కినేని నాగేశ్వరరావు నుంచి పొగడ్తలకు పొంగి పోకూడదని నేర్చుకున్నా’ అని చెప్పారు బాలకృష్ణ.

- ఆంధ్రజ్యోతి, హిందూపురం

Updated Date - 2023-01-27T05:01:25+05:30 IST