తంగలాన్‌ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది

ABN , First Publish Date - 2023-11-04T00:41:48+05:30 IST

తమిళ హీరో విక్రమ్‌ కథానాయకుడిగా పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్‌’. పార్వతి, మాళవికా మోహనన్‌ కథానాయికలు. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు.

తంగలాన్‌ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది

తమిళ హీరో విక్రమ్‌ కథానాయకుడిగా పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్‌’. పార్వతి, మాళవికా మోహనన్‌ కథానాయికలు. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ‘తంగలాన్‌’ టీజర్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈసందర్భంగా విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘శివపుత్రుడు, అపరిచితుడు’లా ‘తంగలాన్‌’ ఒక వైవిధ్యమైన చిత్రం. సినిమా గ్లామర్‌ పాటించని చిత్రమిది. నేను ఇప్పటిదాకా ఇలాంటి చిత్రం చేయలేదు. ప్రేక్షకుల్ని ‘తంగలాన్‌’ తన ప్రపంచంలోకి తీసుకెళుతుంది’ అన్నారు. పా రంజిత్‌ మాట్లాడుతూ ‘విక్రమ్‌తో పనిచేయాలనే కోరిక ‘తంగలాన్‌’తో నెరవేరింది. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’ అన్నారు.

Updated Date - 2023-11-04T00:44:12+05:30 IST