తెలుగు సినిమా ధమాకా చూపాలి

ABN , First Publish Date - 2023-01-09T00:16:33+05:30 IST

‘ధమాకా’ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా గొప్పగా ఆదరించారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు కాబట్టే సినిమా ఇంత పెద్ద హిట్‌ అయింది...

తెలుగు సినిమా ధమాకా చూపాలి

‘ధమాకా’ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా గొప్పగా ఆదరించారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు కాబట్టే సినిమా ఇంత పెద్ద హిట్‌ అయింది. దర్శకుడు త్రినాథరావు, సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో, శ్రీలీల... అందరి కృషితోనే భారీ విజయాన్ని అందుకొంది. ఈ ఏడాది తెలుగు సినిమా ఇలాంటి విజయాలు మరిన్ని అందుకోవాలి’ అని రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘ధమాకా’ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. త్రినాథరావు మాట్లాడుతూ ‘‘ధమాకా’ విజయానికి నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ప్రధాన కారణం. సినిమాను అద్భుతంగా నిర్మించడంతో పాటు భారీగా ప్రమోషన్స్‌ చేశారు. రవితేజ సహకారం వల్లే సినిమా బాగా తీయగలిగాను’ అన్నారు. రవితేజ నాకు బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారు అని శ్రీలీల చెప్పారు. రవితేజ, చిత్రబృందం సహకారం వల్లే హిట్‌ చిత్రాన్ని తీయగలిగామని, ఆయనతో మరిన్ని చిత్రాలు చెయాలనుందని టీజీ విశ్వప్రసాద్‌ అన్నారు.

Updated Date - 2023-01-09T00:16:33+05:30 IST

Read more