కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu cinema is a model for the country : తెలుగు సినిమా దేశానికే ఆదర్శం

ABN, First Publish Date - 2023-08-27T02:37:03+05:30

ఉత్తమ ప్రతిభ కనబరిచిన చలన చిత్రాలకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల ...

ఉత్తమ ప్రతిభ కనబరిచిన చలన చిత్రాలకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటనద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అభినందించారు. 69 ఏళ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడుగా అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్‌ క్రిటిక్‌ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-08-27T02:37:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!