థియేటర్లో టపాసులు మోత

ABN , First Publish Date - 2023-11-14T04:26:34+05:30 IST

సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఏకంగా థియేటర్లోనే టపాసులు కాల్చి దీపావళిని సెలబ్రేట్‌ చేశారు. దీంతో భయపడిన జనం థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు...

థియేటర్లో టపాసులు మోత

  • సల్మాన్‌ ఖాన్‌ అభిమానుల రచ్చ

సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఏకంగా థియేటర్లోనే టపాసులు కాల్చి దీపావళిని సెలబ్రేట్‌ చేశారు. దీంతో భయపడిన జనం థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టైగర్‌ 3’ దీపావళి సందర్భంగా ఆదివారం విడుదలైంది. సాధారణంగా సల్మాన్‌ ఖాన్‌ నటించిన చిత్రం విడుదలైతే అభిమానుల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్‌ బయట కటౌట్లకు అలంకరణలు, టపాసులు పేల్చి హడావిడి చేసేవారు. కానీ మహారాష్ట్రలోని మాలెగావ్‌లో సల్మాన్‌ అభిమానులు మాత్రం అత్యుత్సాహంతో ఏకంగా థియేటర్లలోనే టపాసులు కాల్చారు. ఒక్కసారిగా భారీ శబ్ధాలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక భయపడిన ప్రేక్షకులు థియేటర్‌ బయటకు పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటనపై స్పందించిన సల్మాన్‌ జాగ్రత్తగా ఉండాలని అభిమానులను హెచ్చరించారు. ‘సినిమా నడుస్తున్న సమయంలోనే థియేటర్‌లో టపాసులు కాల్చారని తెలిసింది. ఇలాంటి పని చేయడం ప్రమాధకరం. ఇతరులను ఇబ్బందికి గురిచేయడం ఆపి సినిమాను ఎంజాయ్‌ చేయండి. జాగ్రత్తగా ఉండండి’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-11-14T04:26:36+05:30 IST