తమిళ హీరో అజిత్‌కు పితృవియోగం
ABN, First Publish Date - 2023-03-25T02:48:21+05:30
తమిళ అగ్రహీరో అజిత్ కుమార్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి పి.సుబ్రమణియం అలియాస్ పీఎస్ మణి (84) శుక్రవారం ఉదయం మరణించారు...
తమిళ అగ్రహీరో అజిత్ కుమార్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి పి.సుబ్రమణియం అలియాస్ పీఎస్ మణి (84) శుక్రవారం ఉదయం మరణించారు. నాలుగేళ్లుగా పక్షవాతంతో పాటు వయోభారంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఆయన.. శుక్రవారం ఉదయం నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు అనుప్ కుమార్, అజిత్ కుమార్, అనిల్ కుమార్ సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు బీసెంట్ నగర్‌లోని విద్యుత్ దహనవాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం సాయంత్రమే పూర్తి చేశారు. అజిత్ తండ్రి మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, హీరోలు కమల్ హాసన్, విజయ్, విక్రమ్, జయం రవి, ఎస్.ఏ.సూర్య, హాస్య నటుడు రమేశ్ ఖన్నా, నటుడు మన్సూర్ అలీఖాన్ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
ఆంధజ్యోతి (చెన్నై)